YSRCP:వైసీపీకి మరో బిగ్ షాక్!

by Jakkula.Mamatha |

తిరుపతి(Tirupati)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

YSRCP:వైసీపీకి మరో బిగ్ షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి పదిమంది కీలక నేతలు రాజీనామా చేశారు. వైసీపీ(Ycp) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మణితో పాటు లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జయరాం యాదవ్ గుడ్ బై చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా(Chittoor District)కు చెందిన మరో 8 మంది కూడా రాజీనామా చేశారు. కాగా ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా ఆ పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారు.

చాలా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరిపోయారు. కొన్ని సిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం జగన్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీల్లో చేరిపోయారు. దీంతో కొన్ని మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయారు. దీంతో జిల్లాలపై ఫోకస్ పెట్టిన జగన్.. ఆయా నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. పార్టీని వీడొద్దని దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో షాకింగ్ పరిణామం నెలకొంది. ఒక్కసారిగా ఆ పార్టీకి కీలక నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు.

Next Story