- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : వైసీపీకి మరో భారీ షాక్.. కడప మేయర్ పై అనర్హత వేటు
కడప మేయర్ కొత్తమడ్డి సురేష్ బాబు(Kadapa Mayor Suresh Babu)కు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : కడప మేయర్ కొత్తమడ్డి సురేష్ బాబు(Kadapa Mayor Suresh Babu)కు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణల(Corruption Allegations) నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు(Disqualification) వేస్తూ.. పదవి నుంచి తొలగిస్తూ(Suspension) ప్రభుత్వం(AP Govt) చర్యలు చేపట్టింది. అయితే అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అవమానించడం, భార్య జయశ్రీ అక్రమ నిర్మాణాలపై విమర్శల నేపథ్యంలో గతమార్చి 24న సురేష్ బాబుకు షోకాజ్ నోటీసు జారీ అయింది.
అలాగే సురేష్ బాబు 35 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 2024 డిసెంబర్ 23న ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. వారిని సురేష్ బాబు సస్పెండ్ చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో కూటమి సర్కార్ ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.






