వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. సుప్రీం‌కోర్టు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. సుప్రీం‌కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అనుమతిస్తూ విచారణ ప్రారంభించింది. అయితే, అక్రమ మైనింగ్ కేసులో కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండా వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అయితే, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్‌‌తో పాటు పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని ధర్మాసనం పేర్కొంది.

Next Story