- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్: పీటీ వారెంట్లను తోసిపుచ్చిన కోర్టు
by Seetharam |
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో బిగ్ రిలీఫ్ దక్కింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో బిగ్ రిలీఫ్ దక్కింది. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖౌదీగా ఉన్నప్పుడు ఏపీ సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. అయితే ఈ పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్‌పై ఉన్నారు కాబట్టి పీటీ వారెంట్లు నిరర్దకమవుతాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీ వారెంట్లను తోసిపుచ్చింది.
Next Story






