సీఎం చంద్రబాబు ఇలాకాలో మరో దారుణం.. YCP సంచలన ట్వీట్

by Jakkula.Mamatha |

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుందని వైసీపీ ఆరోపించింది.

సీఎం చంద్రబాబు ఇలాకాలో మరో దారుణం.. YCP సంచలన ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుందని వైసీపీ ఆరోపించింది. కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుందని వైసీపీ వెల్లడించింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మరో ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు శిల్ప అనే దివ్యాంగ మహిళను హత్య చేయడానికి ప్రయత్నించారని వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

బాధితురాలి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ నేత సుబ్రహ్మణ్యం, అతని సహచరులు బాధితురాలి కుటుంబం పై దాడి చేశారని వైసీపీ ఆరోపణలు చేసింది. శిల్ప కుటుంబం తమ భూమిలో అక్రమంగా గోడ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వారిపై కుటుంబం పై దాడి చేసినట్లు తెలిపింది. స్వయంగా టీడీపీ మద్దతుదారు శిల్ప కుటుంబం ఇంత అమానవీయమైన ఘటనను ఎదుర్కొంటుంటే ఎవరు స్పందించడం లేదని వైసీపీ దుయ్యబట్టారు. బాధితులు పోలీసులను సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బాధితులకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ట్వీట్

Next Story