APPSC కేసు.. పోలీసుల అదుపులో మరో నిందితుడు

by Jakkula.Mamatha |

ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

APPSC కేసు.. పోలీసుల అదుపులో మరో నిందితుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో నిందితులుగా ఏ1 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2 మధుసూధన్‌ను పోలీసులు విచారించి విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తాజాగా రఘు అనే నిందితుడిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘుని హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ(Vijayawada)కు తరలిస్తున్నట్లు సమాచారం.

Next Story