- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amaravathi Rajadhani: రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు
రాజధాని అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది.

* భూసేకరణపై ప్రభుత్వం దృష్టి
* భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు!
* అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల ప్రాజెక్టుల కోసం..
* అమరావతి నిర్మాణానికి మరిన్ని అడుగులు
దిశ డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government) దృష్టి సారించింది. ఇప్పటికే కోర్ క్యాపిటల్ పరిధిలో (Core Capital) 33 వేల ఎకరాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న వేళ, తాజాగా మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భూ సమీరణకు సంబంధించి అధికారుల కసరత్తు ప్రారంభమైంది. కోర్ క్యాపిటల్ వెలుపలున్న గ్రామాల్లో భూసేకరణపై (Land Acquisition) ప్రాధమిక అధ్యయనాలు చేపట్టినట్లు సమాచారం.
ఏపీ రాష్ర్ట రాజధానిగా అమరావతి రాజధాని నిర్మాణానికి 2014లో బీజం పండింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దేందుకు తాను ఎంతో కృషి చేశానని పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెబుతుంటారు. అదే విధంగా ఏపీ రాజధానిని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఆయన పిలుపుతో అమరావతి కోసం ఎటువంటి షరతులు లేకుండా 33,000 ఎకరాలు ఇచ్చేందుకు 29 వేల మంది రైతులు ఆరోజు ముందుకు వచ్చారు. నాటి ప్రభుత్వంపై నమ్మకంతోనే వారు ప్రభుత్వానికి భూములు అప్పగించారు. నాటి ప్రభుత్వంలోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు.
2019లో అనూహ్యం వైసీపీ ప్రభుత్వం (YCP) అధికారంలోకి వచ్చింది. మొదట్లో నూతన రాజధాని అమరావతికి ఆదిలో వైసీపీ ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. గతంలో ఏపీ రాజధానిగా అమరావతికి తాము కూడా అనుకూలమేనని స్వయంగా జగన్ ఇల్లు కట్టుకున్నారు. కానీ 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించిన మరుక్షణమే అమరావతిపై జగన్ తన వైఖరిని మార్చేశారు. మూడు రాజధానులు అంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. వివిధ బ్యాంకుల నుంచి కేంద్రం నుంచి నిధులను రాబట్టింది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరో 30 వేల ఎకరాల మేర సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు అయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసమీకరణ చేయాలని ప్రభుత్వం భావిన్నట్లు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్‌కు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది కోర్ క్యాపిటల్‌కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూసమీకరణ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు.






