- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ex Minister Kakani: అరెస్టు భయంతో అజ్ఞాతం!
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్వార్ట్జ్ (Quartz) అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

* రెండో రోజూ విచారణకు హాజరుకాని మాజీ మంత్రి
* కాకాణిపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు
* ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ
దిశ డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్వార్ట్జ్ (Quartz) అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు, (Police) అందుబాటులో లేకపోవడంతో నోటీసులు తలుపులకు అంటించి వచ్చారు. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి నెల్లూరుకు రాలేదు. హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ బంధువులకు నోటీసులు అందించి వచ్చారు. ఈరోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. పొదలకూరు లోని ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. కాకాని విచారణ హాజరు కాకపోతే తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. మొత్తం మీద మాజీ మంత్రి అజ్ఞాతం వీళ్ళలోకి వెళ్లిపోవడం ఏపీలో హార్ట్ టాపిక్ గా మారింది.






