పదో తరగతి ఫలితాలపై ఎస్ఎస్సీ బోర్డు అధికారుల ప్రకటన

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-05-05 12:29:54  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం జరుగుతుంది.

పదో తరగతి ఫలితాలపై ఎస్ఎస్సీ బోర్డు అధికారుల ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం జరుగుతుంది. ఈనెల 5న లేదా 7న ఫలితాలు విడుదలవుతాయంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారం తీవ్రంగా జరగడంతో ఎస్ఎస్సీ బోర్డు స్పందించింది. పదో తరగతి పరీక్షా ఫలితాలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిజల్ట్స్ విడుదల తేదీని తాము అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు.

Also Read...

టెన్త్ రిజల్ట్స్‌పై క్లారిటీ ఇచ్చిన అధికారులు

రేపే టెన్త్ రిజల్ట్స్.. ఉదయం 11 గంటలకు రిలీజ్

Next Story