డీఎస్సీ నియామకాల అనంతరం మిగిలిన పోస్టులు ఎన్నంటే..?

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని నిర్వహించిన విషయం తెలిసిందే.

డీఎస్సీ నియామకాల అనంతరం మిగిలిన పోస్టులు ఎన్నంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (coalition government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ (మెగా డీఎస్సీ)ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌ (Final selection list)ను సోమవారం ఉదయం డీఎస్సీ కన్వీనర్‌ వెంకట‌కృష్ణారెడ్డి విడుదల చేశారు. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 20న ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి ప్రైమరీ కీ జులై 5న విడుదల చేయగా.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేశారు.

కాగా ఫైనల్ లిస్ట్ అనంతరం వివిధ జిల్లాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హాజరు కాకపోవడంతో.. జిల్లాల వారీగా మిగిలిన పోస్టుల వివరాలను ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేయగా.. ఫైనల్ లిస్ట్ ప్రకటన తర్వాత 15,941 పోస్టులను మందిని భర్తీ చేశారు. దీంతో 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి : 99.70%, విశాఖపట్నం : 99.56% కృష్ణా : 99.18%, విజయనగరం : 99.14%, అనంతపురంలో 93.09% పోస్టులను భర్తీ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులు అందుబాటులో లేని కారణంగా 406 ఖాళీలు మిగిలాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. మిగిలిన ఈ పోస్టులను ఈ త్వరలో ప్రకటించ బోయే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story