విధుల పట్ల నిర్లక్ష్యం.. అన్నవరం ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని పేరుగాంచిన అన్నవరం (Annavaram) సత్యనారాయణ స్వామి ఆలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

విధుల పట్ల నిర్లక్ష్యం.. అన్నవరం ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పేరుగాంచిన అన్నవరం (Annavaram) సత్యనారాయణ స్వామి ఆలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్బారావు (EO Subba Rao) ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు చేశారు. అదేవిధంగా మరో ఐదుగురు ఉద్యోగులకు షోకాజు నోటీసులు (Show Cause Notices) ఇచ్చి వారం రోజుల లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఆలయ పరిధిలో విధుల నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన పీఎఫ్ (Provident Fund) చెల్లింపుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిట్లుగా ఈవో దృష్టి వచ్చింది. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, సదరుఏజెన్సీ ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బు జమ చేయకుండానే చేసినట్లుగా నకిలీ చలాన్లను ఆలయ అధికారులకు సబ్మిట్ చేశారు. కానీ, వాటిని పరిశీలించకుండానే కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు బిల్లుల చెల్లింపు జరిగింది. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ పారిశుద్ధ్య సూపర్‌వైజర్ వెంకటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణలపై ఈవో సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో సూపర్‌వైజర్‌కు సత్య శ్రీనివాస్‌కు ఛార్జి మెమో ఇచ్చారు. ఇక టోల్ ఫీజు జీఎస్టీ వసూళ్లలో ఏమరపాటుగా ఉన్న నలుగురు ఉద్యోగులకు షోకాజు నోటీసులు ఇచ్చిన వారంలోగా సమాధానం చెప్పాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.

Next Story