- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా తుఫాన్ ఎఫెక్ట్..శ్రీశైలంలో భక్తులకు అన్నప్రసాద వితరణ
శ్రీశైలంలో భక్తులకు అలర్ట్. శ్రీశైలంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలంలో భక్తులకు అలర్ట్. శ్రీశైలంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతుండడంతో శ్రీశైలానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోనే ఉండిపోయిన భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తోంది దేవస్థాన కమిటీ. బస్టాండు, శిఖరం అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద అన్నప్రసాదాలను అందజేస్తోన్నారు. శిఖరం వద్దకు స్వయంగా వెళ్లి భక్తులతో మాట్లాడిన దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు.. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా, మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు ఏపీలో పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఉన్న పాతాళగంగ దారిలో కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. కావలిలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
READ MORE .....
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన






