అరుదైన ఘనత సాధించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్.. సీఎం అభినందనలు

by Naga Rani Yarlagadda |

అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విశేషమైన ఘనతను సాధించారు.

అరుదైన ఘనత సాధించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్.. సీఎం అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విశేషమైన ఘనతను సాధించారు. ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records), లండన్ నుంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో లభించిన సర్టిఫికెట్‌ను ఆయన సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేతుల మీదుగా అందుకున్నారు.

‘యోగాంధ్ర–2025’ (Yogandhra - 2025) కార్యక్రమంలో భాగంగా మే 21 నుండి జూన్ 21 వరకు అన్నమయ్య జిల్లాలో విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. మే 28న 13,594 మంది హెల్త్ వర్కర్లతో ఒకేసారి గంటపాటు యోగా చేయించి, శ్రీధర్ చామకూరి గిన్నిస్ స్థాయి విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Next Story