మరిన్ని విజయాలు సాధించాలి: పవన్‌ కల్యాణ్‌పై అన్నామలై ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

పవన్ కల్యాణ్ ప్రజాసేవా ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో కొనసాగాలని తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆకాంక్షించారు. ...

మరిన్ని విజయాలు సాధించాలి: పవన్‌ కల్యాణ్‌పై అన్నామలై ప్రశంసలు
X

దిశ, ఏపీ బ్యూరో: పవన్ కల్యాణ్ ప్రజాసేవా ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో కొనసాగాలని తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ ట్రాన్స్ఫార్మస్ ఏపీ కార్యక్రమంలో భాగంగా 6వ అధ్యాయాన్ని తమిళనాడు బీజేపీ నేత అన్నామలై సోమవారం వీడియో ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వం, ప్రజా సంక్షేమ పాలనపై ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి పళని వరకు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రెండు రోజువారీ బస్సు సర్వీసులను ప్రారంభించడం ఎంతో కాలంగా భక్తులు ఎదురుచూస్తున్న నిర్ణయమని అన్నామలై పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పవన్ కల్యాణ్ చొరవతో అమలులోకి రావడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలను కేవలం పౌరులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిజాయితీ, కరుణ, బాధ్యతతో కట్టుబడి పనిచేస్తారని పవన్ కల్యాణ్‌ను అన్నామలై కొనియాడారు. ప్రజాసేవలో క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు.

Next Story