AP News : 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' అర్హుల జాబితా విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-07-08 16:14:58  IST  )

ఏపీలోని 'అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం'(Annadata Sukhibhav – PM Kisan Scheme) కింద లబ్దిదారులైన 47.77 లక్షల అర్హుల జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది.

AP News : అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ అర్హుల జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని 'అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం'(Annadata Sukhibhav – PM Kisan Scheme) కింద లబ్దిదారులైన 47.77 లక్షల అర్హుల జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్. డిల్లీరావు నేడు వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా సంవత్సరానికి రూ.20,000 (పీఎం కిసాన్ రూ.6,000, రాష్ట్రం నుంచి రూ.14,000) మూడు విడతలలో ఈ నిధులను అందించనుంది. స్వంత భూమి, D-పట్టా, ఇనామ్, అసైన్డ్ ల్యాండ్స్, అడవి భూములు సాగు చేసే రైతులు, భూమిలేని కౌలు రైతులు (OC, BC, SC, ST) ఈ పథకానికి అర్హులు.

వెబ్‌ల్యాండ్, గిరిభూమి పోర్టల్స్ ద్వారా డేటా సేకరించి, 98% రైతులు e-KYC పూర్తి చేశారు. జులై రెండవ వారంలో రూ.7,000 (పీఎం కిసాన్ రూ.2,000, అన్నదాత రూ.5,000) జమ కానుంది. ఆగస్ట్‌లో మరో విడత విడుదలవుతుంది. అర్హుల జాబితాను annadathasukhibhava.ap.gov.in లో చెక్ చేసుకోవాలని డిల్లీరావు సూచించారు.

Next Story