- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ అన్నదాత సుఖీభవ డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇవాళ రైతుల అకౌంట్లో అన్నదాత

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇవాళ రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఇవాళ అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతలో ఒక్కో రైతుకు ఐదువేల రూపాయల చొప్పున దాదాపు 2342.92 కోట్ల నిధులను జమ చేయబోతున్నారు.
అలాగే మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ లో భాగంగా 2000 రూపాయల సహాయని కలిపి మొత్తం 7000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనుంది సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాదు ఈ పథకం నేపథ్యంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది. 155251 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి... ఏదైనా సమస్యలు తలెత్తితే సంప్రదించాలని ఏపీ సర్కార్ సూచనలు చేసింది.






