ఏపీ రైతుల‌కు శుభ‌వార్త‌....త్వ‌ర‌లోనే ఆ డ‌బ్బులు జ‌మ‌

by velandi.Saikiran |

అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది

ఏపీ రైతుల‌కు శుభ‌వార్త‌....త్వ‌ర‌లోనే ఆ డ‌బ్బులు జ‌మ‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త. ఏపీ రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ( Annadata Sukhibhava 2025) అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే, ఈ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను త్వరలోనే రిలీజ్ చేయనుందట. ఈ నవంబర్ లోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను విడుదల చేయనుంది.

నవంబర్ 19వ తేదీన ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా అదే రోజున లేదా, మరుసటి రోజున విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 రైతుల‌కు అంద‌నున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 అదనంగా కలిపి, మొత్తం రూ.7000 జమ చేయనుంది. ఈ పథకం ద్వారా దాదాపు 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

Next Story