అంజనాదేవికి అస్వస్థత..? కేబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-24 06:17:49  IST  )

సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది.

అంజనాదేవికి అస్వస్థత..? కేబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పవన్, సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరగుతుండగానే హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story