- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యల కేసు.. విచారణకు రాలేనని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)కు ఇటీవలే కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)కు ఇటీవలే కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లోకల్ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (MLA Prashanthi Reddy)ని దూషించిన వ్యవహారంలో అనిల్‌పై పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ, అనిల్ కుమార్ అందుబాటులో లేకపోవడం ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. అయితే, తాజాగా నోటీసులపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాను విచారణకు హాజరు కావాల్సిన పోలీసులకు తన లాయర్ల ద్వారా సమాచారం అందజేశారు. వ్యక్తిగత కారణాలు, కోర్టులో క్యాష్ పిటిషన్ ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని అనిల్ కుమార్ పోలీసులు సమాచారం ఇచ్చారు.
Next Story






