- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలో(Vijayawada) మరోసారి రౌడీషీటర్లు (Rowdysheeters) రెచ్చిపోయారు. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. బార్ కు వచ్చిన వ్యక్తులపై దాడికి దిగడమే కాకుండా ఆపడానికి వచ్చిన వారిపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట (Kedareshwarapeta) ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కేదారేశ్వరపేటలోని మాధురి బార్ ఉంది. అక్కడ మద్యం మత్తులో తూలుతున్న రౌడీషీటర్లు అప్పటికే హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో బార్‌కు పార్సిల్ తీసుకునేందుకు వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయోధ్యనగర్‌కు చెందిన రౌడీషీటర్లు రాము, సాల్మన్‌లు బీరు సీసాలతో మోహన్ కుమార్‌ను చితకబాదారు. ఈ ఆకస్మిక దాడితో భయభ్రాంతులకు గురైన బాధితుడు ప్రాణభయంతో కేకలు వేశాడు. అక్కడున్న వారు అది గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
నిందితులు రాము, సాల్మన్‌లు అడ్డువచ్చిన వారిని కూడా వదలకుండా దాడులకు తెగబడ్డారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వీరు అడ్డుకోబోయిన వ్యక్తులపై భౌతిక దాడి చేస్తూ భీభత్సం సృష్టించారు. ఈ మొత్తం ఉదంతం బార్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బహిరంగ ప్రదేశంలో రౌడీషీటర్లు బీరు సీసాలతో దాడికి పాల్పడటం చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెజవాడలో శాంతిభద్రతలను కాపాడాలని, ఇలాంటి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






