13న అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి భూమిపూజ : బాలకృష్ణ

by Muthe.Rajitha |

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).

13న అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి భూమిపూజ : బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). ఈనెల 13న రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati)లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital)కి భూమిపూజ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), తన సోదరి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేస్తారని తెలిపారు. నేడు అమరావతిలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. మొత్తం 21 ఎకరాల్లో నిర్మించబోయే ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితులకు అంతర్జాతీయస్థాయి వైద్యం అందిస్తామని అన్నారు.

రానున్న రోజుల్లో హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇక తాను నటించిన 'భగవంత్ కేసరి'(Bhagwant Kesari) సినిమాకు నేషనల్ అవార్డు(National Award) రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. మహిళా సాధికారిత కోసం తీసిన ఈ చిత్రం నేషనల్ అవార్డు జ్యురీని మెప్పించడం ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచి తాను నటించే సినిమాలన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ గానే ఉంటాయని బాలకృష్ణ ప్రకటించారు.

Next Story