ఏపీకి మరోసారి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-12 13:42:18  IST  )

ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.

ఏపీకి మరోసారి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు మరోసారి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. క్లైమేట్ యాక్షన్ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన కందులవారిపల్లెకు అవార్డు వచ్చింది. గ్రామంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు, వర్షపు నీటి సంరక్షణ, హరిత అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థాయిలో కాలుష్య నియంత్రణకు చర్యలు అమలు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. అలాగే ఆత్మనిర్భర్ విభాగంలో కాణిపాకం, సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన పంచాయతీ రిసోర్స్ సెంటర్ కు అవార్డులొచ్చాయి. గ్రామ పాలనలో సాంకేతిక సేవలు, శిక్షణా కార్యక్రమాలు, స్థానిక సంస్థల బలోపేతం వంటి అంశాల్లో విశేషంగా పనిచేసినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో ఏపీకి ఐదు అవార్డులు రాగా.. గడిచిన 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ 19 జాతీయ అవార్డులు సాధించింది.

రైతులు ఈ రకం వరి సాగు చేయొద్దు : మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి

Next Story