ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

by velandi.Saikiran |

అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava)- PM కిసాన్ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు పూట మీ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava)- PM కిసాన్ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనుంది చంద్ర‌బాబు సర్కార్. ఈ పథకంలో భాగంగా 46,85,838 రైతుల ఖాతాలలో రూ.3135 కోట్ల డబ్బును జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ప‌థ‌కం కింద రూ.7000ల చొప్పున జ‌మ చేస్తారు.

ఒక్కో రైతు ఖాతాలో మోడీ ప్రభుత్వం వాటా కింద ₹2,000, ఇటు ఏపీ వాటా కింద రూ.5000 మొత్తం కలిపి 7000 జమ చేయబోతున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరగనుంది. ఇందులో చంద్రబాబు నాయుడు పాల్గొని డబ్బులను రిలీజ్ చేస్తారు. అదే సమయంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ రూ.2000 చొప్పున పీఎం కిసాన్ సహాయాన్ని నేడు రిలీజ్ చేయనున్నారు. ఈ PM కిసాన్ పథకంలో భాగంగా ఏడాదికి రూ.6000 మూడు విడ‌ద‌ల‌లో రూ.2000 చొప్పున కేంద్రం అందిస్తోంది.

Next Story