Andhra Pradesh: అసలైన లబ్ధిదారులకే 'టిడ్కో' ఇళ్ళు.! మంత్రి నారాయణ

by Geesa Chandu |

టిడ్కో ఇళ్లకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ పురపాలక మంత్రి నారాయణ తెలిపారు.

Andhra Pradesh: అసలైన లబ్ధిదారులకే టిడ్కో ఇళ్ళు.! మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: టిడ్కో ఇళ్లకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి మాత్రమే ఇళ్ల హక్కు పట్టాలు ఇస్తామని చెప్పారు. మంత్రి నారాయణ అక్కడి స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి, చిలకలూరిపేటలో ఉన్నటువంటి 'టిడ్కో' ఇళ్లను మరియు దాంతో పాటూ.. అన్న క్యాంటీన్ ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మార్చి చివరి నాటికి, సకల సౌకర్యాలతో లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే.. గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, వీటితో పాటు చిలకలూరి పేట ఎన్ఆర్టీ సెంటర్ లోని అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు మంత్రి నారాయణ. ఈ నెల ఆగస్టు 15 వ తేదీ నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్న క్యాంటీన్ లను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Next Story