చిచ్చు బుడ్డి తుస్సుమంది: ప్రధాని మోడీపై షర్మిల సెటైర్లు

by Vemula.Srinu Prasad |

ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చు బుడ్డి తుస్సుమంది అనక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు....

చిచ్చు బుడ్డి తుస్సుమంది: ప్రధాని మోడీపై షర్మిల సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) తీరు చూస్తే చిచ్చు బుడ్డి తుస్సుమంది అనక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress Party AP President YS Sharmila)విమర్శించారు. మోడీ అమరావతి పర్యటనపై ఆమె స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం(Andhra Pradesh Reorganization Act) 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని ఆమె చెప్పారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటని?, ఆనాడు 2015లో మట్టి కొట్టారని, నేడు సున్నం కొట్టి వెళ్ళారని వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.

‘‘10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు ? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా ? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా ? చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోడీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలి. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు .. మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారు.’’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Next Story