కోస్తాంధ్రకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-09 12:03:29  IST  )

ఏపీలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత రోజురోజుకూ పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు పది రోజులైనా.. అవి మందగించడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కోస్తాంధ్రకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత రోజురోజుకూ పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు పది రోజులైనా.. అవి మందగించడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఠారెత్తించే ఎండలతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో (Coastal Andhra) ఈ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఏసీ గదుల్లో నుంచి బయటికి రావాలంటే అమ్మో అనిపించేలా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

సోమవారం కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది. కోస్తాంధ్రలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. కర్నూలు,ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు, బాపట్ల,నంద్యాల, కడప,అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక ఆదివారం (జూన్ 8) కావలిలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. నెల్లూరు, విజయవాడలో 41, గుంటూరు 407, బాపట్ల 40.5, ఒంగోలు 40.3, తిరుపతి, కడప, రాజమండ్రి 39, మచిలీపట్నం, నరసాపురం, కర్నూల్, కాకినాడల్లో 38, తుని 37, వైజాగ్ 36, శ్రీకాకుళంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ 10 నుంచి రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story