- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ పేరు ‘లోక్‌భవన్’ గా మార్పు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్‌భవన్‌కు లోక్‌భవన్‌గా పేరు మర్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్‌భవన్‌కు లోక్‌భవన్‌గా పేరు మర్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లు 'రాజ్ భవన్' గా ఉండగా.. వాటిని 'లోక్ భవన్' గా మార్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాచారం మేరకు రాజ్‌భవన్ పేరు మార్పు చేశారు. రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చడానికి ఏపీ గవర్నర్ గవర్నర్ ఆమోదం తెలిపారు. పేరు మార్చడానికి గవర్నర్ ఆమోదంతో ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
కాగా, కేంద్ర ఆదేశాల మేరకు రాజ్‌భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. నేడు ఆ జాబితాలో ఏపీ కూడా చేరింది.






