- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు ఎండలు దంచికొట్టగా శుక్రవారం

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు ఎండలు దంచికొట్టగా శుక్రవారం రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో శుక్రవారం కురిసిన వర్షానికి భారీ చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ సమస్యలు నెలకొన్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలో పిడుగులు పడటంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక నేడు కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డీఎంఏ హెచ్చరించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ వర్షం పడుతున్నప్పుడు బయటకు రావొద్దని హెచ్చరించింది. అదేవిధంగా విజయనగరం,శ్రీకాకుళం,విశాఖ,మన్యం, రాయలసీమ,తూర్పుగోదావరి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.






