- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Andhra Pradesh: లక్షటన్నుల 'కందిపప్పు' అవసరం..! మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ కు లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని..కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ కు లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని..కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దిల్లీలోని కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం.. మంత్రి మీడియాతో మాట్లాడారు. "రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీకి చాలా అన్యాయం జరిగింది. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికన కాకుండా.. 2001 సెన్సస్ ప్రకారం కేటాయించారు. దీంతో ఏపీకి రేషన్ కార్డుల జారీ బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఏ ఆటంకం లేకుండా ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని.. పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాం" అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా అన్నారు.






