- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్
by Bhoopathi Nagaiah |
తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

X
దిశ,తిరుమల : తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Next Story






