ఆధార్‌ తరహాలో మరో కార్డు.. కుటుంబాలు విడిపోకుండా సరికొత్త స్కీం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మరో కార్డు అందుబాటులోకి రానుంది...

ఆధార్‌ తరహాలో మరో కార్డు.. కుటుంబాలు విడిపోకుండా సరికొత్త స్కీం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో ప్రతిదీ డిజిటలైజేషన్(Digitalaization) అయిపోతున్నాయి. ఇంటి పట్టా నుంచి కాలేజీ పట్టా వరకూ అన్ని కూడా ఆన్‌లైన్‌లోకి ఎక్కేస్తున్నాయి. అంతేకాదు వాటిని చూడాలంటే పాస్‌వర్డ్‌ కొట్టాల్సిందే. ఇలా ప్రతీది స్మార్ట్‌గా మారుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రేషన్ కార్డులు చాలా పెద్దగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వాటిని డిజిటలైజ్ చేసి చిన్నాగా మార్చేసింది. ఇప్పుడు మరో కార్డును కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.


రాష్ట్రంలో ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థ(Family Benefit Monitoring System)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తాజాగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ఆధార్‌ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని చెప్పారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story