సీఎం కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సీఎం కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపు విషయంలో సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చే పనికిమాలిన వారికి టికెట్లు ఇస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా వారి క్యారెక్టర్ కీలకమని.. టీడీపీ నుంచి వస్తున్న వారికి క్యారెక్టర్ చూసి టికెట్ కేటాయించాలని తెలిపారు.

అలా ఏ అర్హత చూడకుండానే టికెట్లు కేటాయిస్తే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తుచేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నారని వార్తలు వచ్చాయని.. జగన్ కాళ్లు పట్టుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేవాళ్లంతా కోవర్టులేనని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవర్టులుగా వచ్చి టికెట్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed