కూలీల కడుపు కొట్టేందుకే BJp దుస్సాహసం...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 10:59:31  IST  )

ప్రధాని మోడీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు..

కూలీల కడుపు కొట్టేందుకే BJp దుస్సాహసం...!
X

దిశ, సూళ్లూరుపేట: కాంగ్రెస్ పాలనలో నిరుపేద కూలీల జీవన భృతి కోసం ఆనాడు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంను భారతీయ జనతా పార్టీ పేరు మార్పు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని వైయస్ షర్మిల ప్రశ్నించారు. పథకాన్ని ప్రక్షాళన అంటూ నిరుపేద కూలీల కడుపు కొట్టేందుకే మోడీ ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడిందని దుయ్య పట్టారు. శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం లోని కోటపోలూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించి, రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో చేర్పులు మార్పులు అంటూ పథకాలను నిర్వీర్యం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రధానంగా కర్మాగార కార్మికులకు 8 గంటలు ఉన్న పని వేళలను 12 గంటలు పెంచడం, ఉపాధి హామీ పథకానికి 100% శాతం నిధులు ఇవ్వకుండా40% శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తీసుకున్న చర్యలు దుర్మార్గమైనవని అభివర్ణించారు.


కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాజీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన అనేక పథకాలు దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆదర్శవంతంగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం ప్రభావం చూపుతున్న రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను తొలగించాలన్నారు. రహదారుల నిర్మాణాలు, ఆరోగ్యశ్రీ అమలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. పేద ప్రజలకు న్యాయం జరగాలన్న రాష్ట్రంలో అభివృద్ధి చూడాలన్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి పాలనలోకి తీసుకురావాలని కోరారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను కూడా స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు, సులూరుపేట పార్టీ ఇన్చార్జి మావుడూరు వెంకటాచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జీలు, పలు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story