- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టీడీపీ గుప్పిట్లోకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్..?
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ను టీడీపీ స్వాధీనంలోకి తీసుకోనుంది. తెరవెనుక మంత్రి లోకేష్ చక్రం తిప్పినట్లు సమాచారం. లోకేష్ ఏసీఏ బాధ్యతలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఏసీఏకు నూతన అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇప్పటికే చిన్ని ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 8న గుంటూరులో ఎన్నికలు జరుగనున్నాయి. కేశినేని శివనాథ్ కు కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో ఉపాధ్యక్షుడుగా పోస్ట్ కల్పించి ఓటు హక్కును ఇచ్చారు.
ఆరు పోస్టులకు ఎన్నికలు..
మొత్తం ఆరు పోస్టులకు ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిల్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న ఎన్నికల తేదీని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏసీఏ లో ఓటర్లు ఎంత మందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అందరూ క్రికెట్ క్లబ్, క్రికెట్ అసోసియేషన్లోని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని భావించారు. అయితే ఒక్కో అసోసియేషన్ నుంచి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర కమిటీని ఎన్నిక చేసుకునేందుకు ఓటరుగా ఉండాలో జిల్లా అసోసియేషన్లు, క్లబ్ నిర్ణయిస్తాయి. క్రికెట్ అసోసియేషన్ నుంచి 13 మందికి, క్రికెట్ క్లబ్ నుంచి 18 మందికి, ముగ్గురు అంతర్జాతీయ క్రికెటర్లకు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం 34 ఓట్లు ఉన్నాయి. వీరితో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు అయినా ఎం.ఎస్.కె.ప్రసాద్, వై.వేణుగోపాలరావు, ఆర్.కల్పనలు ప్రత్యేక ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఈ ఓటర్లు రాష్ట్ర కమిటీని ఎన్నుకోనుండగా, నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కమిటీ నియమించింది. ఓటర్లకు సంబంధించిన వివరాలు, ఓటర్ల జాబితాను ఈనెల 11లోపు క్లబ్‌లు, అసోసియేషన్లు ఎన్నికల అధికారికి ఇవ్వాలని, ఓటర్లకు సంబంధించిన రెండు ఫొటోలు ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు. ఈనెల 14 లోపు ఓటర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి తెలియజేయాలి. ఒక్కో అభ్యర్థి ఒక్క పోస్టుకు మాత్రమే పోటీ చేయాల్సి ఉంది. వ్యక్తిగతంగా హాజరై పోటీదారులు నామినేషన్లు దాఖలు చేయాలి. స్క్రూటినీ తర్వాత పోటీదారుల వివరాలు ప్రకటిస్తారు. 70 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు అసోసియేషన్‌లో ఉండకూడదు. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ గుప్పిట్లో ఉన్న ఏసీఏ ఇప్పుడు తెలుగుదేశం గుప్పిట్లోకి వెళ్ళనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయాలు చోటు చేసుకున్నాయి.
- Tags
- Telugu news
- ACA