- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరి కాసేపట్లో జనసేన పార్టీ జనరల్ బాడీ భేటీ
సుమారు మూడు గంటల పాటు సాగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : మంగళగిరి (Mangalagiri) వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ (Janasena Party) జనరల్ బాడీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి పార్టీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు (MPs), శాసన మండలి సభ్యులు (MLCs), శాసనసభ సభ్యులు (MLAs) అందరూ హాజరవుతున్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా, నగర అధ్యక్షులు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ సెల్ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంలో కేడర్ పాత్ర, రాబోయే రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సుమారు మూడు గంటల పాటు సాగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.






