- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తవ్వకాల్లో దొరికిన ఇనుప బీరువా.. లోపల భారీగా నిధి..?
by Chukka Sudharani |
ఇటీవల కాలంలో తవ్వాకాల్లో పురాతన వస్తువుతు బయట పడుతుండటం మనం వింటూనే ఉన్నాం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో తవ్వాకాల్లో పురాతన వస్తువుతు బయట పడుతుండటం మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వింత జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా పాత కాలం నాటి బీరువా ఒకటి బయటపడింది. ఈ బీరువా పురాతన కాలానికి చెందినది కావడంతో ఇందులో భారీగా నిధి ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది.
దీంతో చుట్టుపక్కల వాళ్లంతా కలిసి బీరువాను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని మొయ్యలేక.. జేసీబీతో బయటకు తెచ్చారు. ఈ విషయం కాస్తా రెవెన్యూ అధికారులకు తెలిసింది. కాగా.. వాళ్లు బీరువాను ఓపెన్ చేసి అందులో ఏముందనేది తేల్చబోతున్నారు. ఒకవేళ దొరికిన బీరువాలో నిధి ఉన్నట్లయితే అది ఎవరికి చెందుతుందనే సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు.
Next Story






