బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ‌పై యాంక‌ర్, వైసీపీ నాయ‌కురాలు శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూపూర్ లో కొద్దిరోజుల క్రితం వైసీపీ కార్యాల‌యంపై దాడులు చేశార‌ని, విధ్వంసం సృష్టించార‌ని అన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌నే కొట్టి వారిపైనే కేసులు పెట్టార‌ని ఆరోపించారు.

బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ‌పై యాంక‌ర్, వైసీపీ నాయ‌కురాలు శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూపూర్ లో కొద్దిరోజుల క్రితం వైసీపీ కార్యాల‌యంపై దాడులు చేశార‌ని, విధ్వంసం సృష్టించార‌ని అన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌నే కొట్టి వారిపైనే కేసులు పెట్టార‌ని ఆరోపించారు. నిన్న‌టికి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ లక్ష్మీ దుర్గ‌య్య వైసీపీ నేత ప్ర‌శాంత్ గౌడ్ పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని అన్నారు. ఇంత జ‌రుగుతున్నా హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఎందుకు మాట్లాడ‌టంలేద‌ని ప్ర‌శ్నించారు.

వైసీపీ పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా బాల‌కృష్ణ స్పందించ‌లేద‌న్నారు. ఈరోజు కూడా మాట్లాడ‌టం లేద‌న్నారు. సినిమాలు అంటే త‌న‌కు చాలా గౌర‌వం తాను కూడా అక్క‌డ నుండే వ‌చ్చాన‌ని చెప్పారు. కానీ ఇది కూడా డ్యూటీనే కదా అని ప్ర‌శ్నించారు. మీ పీఏనే ఎక్సైజ్ సీఐ మీద ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నార‌నే విష‌యం మీకు తెలుసు అనే విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు. దాడుల‌పై బాల‌కృష్ణ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై నోరు మూసుకుని ఉంటామ‌ని అనుకుంటే అది మీ పొర‌పాటే అంటూ హెచ్చ‌రించారు.

Next Story