- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా లోకం తలదించుకునేలా భానుప్రకాష్ వ్యాఖ్యలు : యాంకర్ శ్యామల
by Muthe.Rajitha |
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్(MLA Bhanu Prakash) వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా(Roja)పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్(MLA Bhanu Prakash) వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా(Roja)పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల(Anchor Shyamala) తీవ్రంగా ఖండించారు. భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉన్నాయని, సభ్య సమాజానికి అవమానకరమని మండిపడ్డారు. మహిళా మాజీ మంత్రిని అవమానించిన ఎమ్మెల్యేపై చట్టపరమైన, రాజకీయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే గాలి భానుప్రకాష్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'రోజా 2 వేలు ఇస్తే ఏ పనైనా చేసేది' అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలను రోజా ఖండిస్తూ ఆయనను "గాలి గాడు" అని విమర్శించారు.
Next Story






