దమ్ముంటే పట్టుకోరా షెకావత్...అంటూ అనంతపురంలో యువకుల హల్ చల్

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 15:10:03  IST  )

యువత రోజురోజుకు.. తప్పుడు దారులు తొక్కుతోంది. తల్లిదండ్రుల భయం లేకపోవడంతో కొంతమంది... ఇతరులను చూసి మరి

దమ్ముంటే పట్టుకోరా షెకావత్...అంటూ అనంతపురంలో యువకుల హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: యువత రోజురోజుకు.. తప్పుడు దారులు తొక్కుతోంది. తల్లిదండ్రుల భయం లేకపోవడంతో కొంతమంది... ఇతరులను చూసి మరి కొంతమంది యువకులు చెడిపోతున్నారు. మద్యం ఒక్కటే కాదు గంజాయి (Ganja) కూడా కొట్టి రెచ్చిపోతున్నారు. ఈ మధ్య యువత.. రోడ్లపై గంజాయి కొట్టి రచ్చ చేసిన సంఘటనలు చాలానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ( Andhra Pradesh) మరో సంఘటన జరిగింది.

అనంతపురం జిల్లాలో (Ananthapuram) మద్యం మత్తులో కొంత మంది యువకులు హల్చల్ చేశారు. గంజాయి, మద్యం మత్తులో యువకుడిని విచక్షణ రహితంగా.. ఇద్దరు యువకులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడితో ఆగకుండా అనంతపురం పోలీస్ స్టేషన్ ముందు కూడా రచ్చ చేశారు. దమ్ముంటే పెట్టుకోరా షెకావత్... పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం... అంటూ పోలీస్ స్టేషన్ ముందు సినిమా డైలాగులు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే.. వీడియో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఆ యువకులను ముగ్గురిని అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అనంతపురం వన్ టౌన్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Next Story