- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anantapur: వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేశారు....

దిశ, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ మద్దతుదారుడు శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేశారు. స్థానిక యువకుడు వంశీ, అతని అనుచరుల దాడిలో శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం. అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్‌లో వంశీ అనే వ్యక్తితో వైసీపీ మద్దతుదారు శ్రీనివాస్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే వంశీ తన అనుచరులను తీసుకొచ్చి శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, శ్రీనివాస్ హత్య జరిగిన స్థలాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.
ఇవి కూడా చదవండి: బ్రేకింగ్ : వివేకా హత్య కేసు : సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు






