Uma Maheswaranaidu: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

by Vemula.Srinu Prasad |

చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమా మహేశ్వరనాయుడు పేర్కొన్నారు. ..

Uma Maheswaranaidu: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
X

దిశ కళ్యాణదుర్గం: చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమా మహేశ్వరనాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండల కేంద్రంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామస్తులు పూలవర్షంతో ఉమామహేశ్వర నాయుడుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను అడుగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న రచ్చకట్ట వద్ద ఉమా మాట్లాడుతూ ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. వైసీపీ పాలన అంతా దోపిడి దుర్మార్గం అక్రమాలు దౌర్జన్యాలకే పరిమితమయ్యారని విమర్శించారు. టీడీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారన్నారు. అందుకోసం నేడు ఏ గ్రామంలో చూసినా చంద్రబాబు నాయుడుకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడును సీఎంగా చేయడానికి గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు.

Next Story