- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కదిరి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి.. ఆరుగురికి గాయాలు
by Naga Rani Yarlagadda |
కదిరి బ్రహ్మరథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథం లాగుతూ ఆరుగురు రథచక్రాల కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరిలోని శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవంలో భారీ ప్రమాదం తప్పింది. వేలాది మంది భక్తుల జయ జయధ్వానాల మధ్య వైభవంగా సాగుతున్న రథోత్సవంలో ఒక్కసారిగా అపశృతి చోటుచేసుకుంది. రథం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా భక్తుడు రథచక్రం కిందపడిపోయాడు. అతన్ని కాపాడబోయి మరో ఐదుగురు భక్తులు రథచక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులకు గాయాలవ్వగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రథం కొద్దిసేపు నిలిచిపోయింది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులతో కదిరి పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం రథం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Next Story






