ఏపీలో షాకింగ్ ఘటన..బాత్రూంలోకి వెళ్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు

by Ajay Maddhiboyina |

స్నానం చేయ‌డానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారు స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న ఏపీలో చోటు చేసుకుంది.

ఏపీలో షాకింగ్ ఘటన..బాత్రూంలోకి వెళ్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు
X

దిశ‌, వెబ్ డెస్క్: స్నానం చేయ‌డానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారు స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న ఏపీలో చోటు చేసుకుంది. ఏపీలోని అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలో చిన్నారుల స్నానం కోసం త‌ల్లి బాత్రూంలోని గీజ‌ర్ ఆన్ చేసింది. కాగా లోప‌లికి వెళ్లిన చిన్నారులు ట్యాప్ ఆన్ చేశారు. గీజ‌ర్ నుండి పొగ‌లతో విప‌రీతంగా వేడీగా ఉన్న నీరు బకెట్లో ప‌ట్టుకున్నారు. కాగా అందులో నుండి ఆవిరి రావ‌డంతో అది బాత్రూం నిండా విస్త‌రించింది. దీంతో ఊరిరాడ‌క చిన్నారులు కింద‌ప‌డిపోయారు. వెంట‌నే చిన్నారుల‌ను ఉర‌వ‌కొండ ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించగా చికిత్స అందిస్తున్నారు.

Next Story