వైసీపీలోకి జేసీ పవన్ రెడ్డి..?

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు ప్రచారం జరుగుతోంది..

వైసీపీలోకి జేసీ పవన్ రెడ్డి..?
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram)లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి బిగ్ షాక్ తగలనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి(Farmer Mp Jc Diwakar Reddy) తనయుడు జేసీ పవన్ రెడ్డి(Jc Prabhakar Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)లో చేరబోతున్నట్లు స్థానిక రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జేసీ పవన్ రెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. అయితే 2014లో జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ఆశించారు. అయితే జేసీ ఫ్యామిలీలో ఒకరికే సీటు అనే విధానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయన తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2029లోనూ ఆదే విధానం కొనసాగుతుందనే సమాచారంతో జేపీ పవన్ రెడ్డి వైసీపీలో చేరితే సీటు దక్కుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా జగన్ తో చిన్నప్పటి నుంచి బాగా సన్నిహిత సంబంధాలు ఉండటంతో వైసీపీ చేరతారని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి.

Next Story