- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. టీడీపీలోకి భారీగా చేరికలు
రోజు రోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు జారి పోతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఆ పరంపరం కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వైసీపీకి జై కొట్టివాళ్లు కూడా ఫిదా అయిపోతున్నారు. దీంతో బీజేపీ(), టీడీపీ, జనసేన పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వలసలు మరింతగా పెరిగాయి.
జగన్ పార్టీకి భారీ షాక్
తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జగన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అమరాపురం మండలం హలకూరుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేస్తున్న అభివృద్ధి పనులు తనకు నచ్చి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో తామంతా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.






