వ్యూస్ పిచ్చితో పెట్రోల్‌తో చెలగాటం: యువకుడి పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే పిచ్చి నేటి యువతను ప్రమాదకరమైన దారుల్లోకి నెడుతోంది. కేవలం కొన్ని లైకులు, షేర్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేస్తున్నారు. ..

వ్యూస్ పిచ్చితో పెట్రోల్‌తో చెలగాటం: యువకుడి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా(Social Media)లో పాపులారిటీ సంపాదించాలనే పిచ్చి నేటి యువతను ప్రమాదకరమైన దారుల్లోకి నెడుతోంది. కేవలం కొన్ని లైకులు, షేర్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేస్తున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District) పోతలకుంట(Pothalakunta) గ్రామంలో శివకుమార్ అనే యువకుడు(Yung man) కూడా ఇలాగే రీల్స్(Reals) మోజులో పడి తన జీవితాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. పెట్రోల్‌(Petrol)తో వెరైటీగా వీడియో తీసి వైరల్ అవ్వాలనుకున్న ఆశ కాస్తా, ఊహించని ప్రమాదానికి దారితీసింది.

అగ్నికి ఆహుతైన ఆశలు..

రీల్ చిత్రీకరణలో భాగంగా శివకుమార్ పెట్రోల్‌ను ఉపయోగించారు. అయితే ప్రమాదవశాత్తు ఆ పెట్రోల్ అతని ఒంటిపైనే పడింది. క్షణాల్లోనే మంటలు చెలరేగి శివకుమార్‌ను చుట్టుముట్టాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం..

తీవ్రగాయాలపాలైన శివకుమార్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొద్ది నిమిషాల సోషల్ మీడియా ఫేమ్ కోసం యువత ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయవద్దని పోలీసులు, స్థానికులు సూచించారు.

Next Story