తల్లిదండ్రులు పని చేస్తున్న పొలం వద్దకు వెళ్లిన బాలుడు.. కొద్దిసేపటికే విషాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-21 11:49:02  IST  )

అనంతపురం జిల్లా పెద్దమడుగూరు మండలం రావులుడికిలో విషాదం చోటు చేసుకుంది.

తల్లిదండ్రులు పని చేస్తున్న పొలం వద్దకు వెళ్లిన బాలుడు.. కొద్దిసేపటికే విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram District) పెద్దమడుగూరు మండలం రావులుడికి(Ravuludiki)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో గ్రామానికి చెందిన బాలుడు తేజేశ్వర్ రెడ్డి తన తల్లిదండ్రుల పని చేస్తున్న పొల వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటికుంట దగ్గరకు వెళ్లారు. దీంతో ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారీ పడ్డారు. నీటిలో మునిగిపోయారు. కొద్దిసేపటికే బాలుడు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story