టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం(Singanamala Constituency)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. యల్లనూరు(Yellanuru)లో న్యూ ఇయర్ వేడుకల(New Year Celebrations) జరుపుకుంటున్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి.

టీడీపీ నేతల దాడికి నిర‌స‌న‌గా వైసీపీ ధ‌ర్నా

అయితే టీడీపీ శ్రేణుల దాడికి నిర‌స‌న‌గా వైసీపీ నేత‌ల ధ‌ర్నాకు దిగారు. ఈ సమయంలోనూ రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. దీంతో గాయాలతోనే యల్లనూరు పీఎస్ వద్ద జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో ఫిర్యాదును స్వీకరించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోసారి ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story