- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంపై దాడి... ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అర్బన్ సీటును ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం కిటికీలు పగులగొట్టారు. బ్యానర్లు, ఫెక్సీలు, చంద్రబాబు ఫొటోలను తగులబెట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రసాద్‌కు సహకరించమని హెచ్చరించారు. ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు సీటు దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి ఫ్యామిలీ కంటతడి పెట్టుకుంది. పార్టీ కష్టకాలంలో కూడా అండగా ఉన్నామని.. కానీ ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






