- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్వాడీల ఆవేదన పట్టదా: ఉమామహేశ్వర నాయుడు
by Vemula.Srinu Prasad |
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు మండిపడ్డారు....

X
దిశ, కళ్యాణదుర్గం: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు మండిపడ్డారు. కంబదూరు అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ ఇప్పుడు తుంగలో తొక్కారని విమర్శించారు. భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. అంగన్వాడీ జీతాలను రెండు సార్లు పెంచి గౌరవ ప్రదమైన వేతనం ఇచ్చింది చంద్రబాబు అని గుర్తు చేశారు. అంగన్‌వాడీల వేతనాల విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఉమా మహేశ్వర నాయుడు ఎద్దేవా చేశారు.
Next Story






